బాలీవుడ్ ఛాన్స్ కొట్టిసిన ఈషా రెబ్బా

తెలుగులో `రాగల 24 గంటల్లో` చిత్రంలో మెయిన్ లీడ్‌గా నటించిన ఈషా రెబ్బా నటిగా ప్రశంసలందుకున్నా… టాలీవుడ్లో అవకాశాలు అంతంత మాత్రంగానే రావటంతో ఇన్నాళ్లు సతమవుతూ వచ్చింది. తాజాగా ఈ డస్కీ బ్యూటీ ఈషారెబ్బాకు బాలీవుడ్ నుంచి ఓ భారీ చిత్రంలో నటించేందుకు ఛాన్సొచ్చిందని సమాచారం. ఫిలింనగర్ వర్గాల కథనం మేరకు అనిల్ కపూర్ తనయుడు.. హీరోయిన్ సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ త్వరలోనే బాలీవుడ్ లో వెండితెరపై రంగ ప్రవేశం చేయబోతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో హర్షవర్ధన్ సరసన హీరోయిన్గా ఈషా రెబ్బా నకు ఛాన్సొచ్చిందని తెలుస్తోంది.
జాతీయ అవార్డ్ గ్రహిత ప్రముఖ స్క్రీన్‌ప్లే రైటర్ రాజ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ చితంలో ఈషారెబ్బా రాజస్థానీ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. ఇటీవల `రాగల 24 గంటల్లో` చిత్రాన్ని చూసిన ఓ చిత్ర నిర్మాత ఈషా గురించి అనిల్ కపూర్‌కి సమాచారం ఇవ్వటంతో ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన ఆయన ఈ సినిమాలో ఎమోషనల్‌గా సాగే పాత్రకు ఈషారెబ్బా న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలకు రికమండ్ చేయటం, వాళ్లు ఈషాని ఖరారు చేయటం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ఆడిషన్ లో ఈషా రెబ్బా పాల్గొని తన నటనతో దర్శక నిర్మాతలని మరింతగా ఇంప్రస్ చేసి మెప్పు పొందిదని దీంతో అమ్మడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్టేనని టాక్.