రామ్ పోతినేని హీరోగా ‘రెడ్’ చిత్రం…

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగాశ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మి స్తున్నచిత్రం ‘రెడ్’. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్ చేసారు.
ఆ షూటింగ్ ముచ్చట్లను ‘స్రవంతి’ రవికిశోర్ మీడియాతో శుక్రవారం తన కార్యాలయంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”ఇటలీలోని బ్యూటీఫుల్ లొకేషన్స్ లోశోభిమాస్టర్ కొరియోగ్రఫీ లో రామ్, మాళవికా శర్మ లపై ఈ నెల 12 నుంచి 18 వరకూ రెండు పాటలు చిత్రీకరించాం. ఇటలీలోని టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సముద్ర తీర పర్వత ప్రాంతం డోలమైట్స్ . సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. అక్కడ షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావటం విశేషం. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్లో కూడా ప్రత్యేక అనుమతి తీసుకుని కొంత భాగాన్ని చిత్రీకరించాం. సినిమా అంతా ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో చిత్రీకరించే పాట చిత్రీ కరట తదుపరి నిర్మాణంతర కార్యక్రమాలు జరుతాయి” అని తెలిపారు.
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ ”ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా రామ్ చేస్తున్న సినిమా కావటంలో ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా అటు క్లాస్‌నీ, ఇటు మాస్‌నీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించన రోజునే ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించాం. అలానే ఈ సినిమా విడుదల ఉంటుంది” అని చెప్పారాయన.