ద‌ర్శ‌కుడితో ఆ హీరోయిన్ లేచిపోయింద‌ట‌… నిర్మాత‌లు ల‌బోదిబో…

గ‌త కొంత కాలంగా ఓ హీరోయిన్ దర్శకుడితో తెర వెనుక వ్య‌వ‌హారాలు న‌డుపుతు… అర్ధంత‌రంగా క‌నిపించ‌కుండా పోయిన ఘ‌ట‌న కన్నడ చిత్ర సీమలో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివ‌రాల ప్రకారం…   కన్నడంలో 15 సినిమాలకు పైగా  నటించిన విజయలక్ష్మి అనే హీరోయిన్  కొద్ది రోజులుగా  అజినప్ప అనే  దర్శకుడి తో  ప్రేమలో పడిందనే గుస‌గుస‌లు ఇండ‌స్ర్టీలో వినిపిస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఆమె షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నానంటూ…ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి క‌నిపించ‌కుండా పోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళింద‌న్న‌ది తెలియ‌రాక పోగా… తాజాగా ద‌ర్శ‌కుడు  అజినప్ప కూడా క‌నిపించ‌క పోవ‌టంతో ఇద్ద‌రూ క‌ల‌సి వెళ్లిపోయి ఉంటార‌ని రూమ‌ర్స్ మొద‌ల‌య్యాయి,  

షూటింగ్ అంటూ వారం రోజుల క్రితం బైట‌కు వెళ్లిన విజ‌య‌ల‌క్ష్మి త‌న‌ అమ్మమ్మ చనిపోయిన విష‌యాన్ని ఫోన్ ద్వారా తెలిపినా   తిరిగి రాలేదని,  ఇప్పుడు ఆమె తల్లి కూడా అనారోగ్యంతో మంచమెక్కింద‌ని బంధువులు చెపుతున్నారు. కాగా   ఆమె సినిమాలు చేయడానికి గాను, కొందరు నిర్మాతల వద్ద అడ్వాన్సు లు తీసుకుని, ఇప్పుడు  కనపడకపోవడంతో ఆ నిర్మాతలు ఆమె ఇంటికి వచ్చి   తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని ఆమె తల్లి మీద ఒత్తిడి తెస్తుండ‌టంతో దిక్కు తోచక విజయలక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను వెతికి ప‌ట్టుకుని ఇంటికి తీసుకురావాలని కోరింది. కాగా విజ‌య‌ల‌క్ష్మి, అజిన‌ప్ప‌ల ఫోన్లు స్విచ్చాఫ్ వ‌స్తుండ‌టంతో వాళ్లు ఎక్క‌డున్నార‌న్న విష‌యం అంతుబ‌ట్ట‌కుండా ఉంది. ఈ నేప‌థ్యంలో వారి బ్యాంకు ఖాతాల‌పై దృష్టి సారించార‌ని స‌మాచారం. 

Leave a Reply

Your email address will not be published.