మెగాస్టార్ చిరు, కొర‌టాల మూవీ అప్‌డేట్ లేటుకి కార‌ణం ఇదేనా?


“సైరా” చిత్రం తర్వాత మెగాస్టార్ చెయ్యబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ తన 152వ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకున్న “సైరా నరసింహా రెడ్డి” చిత్రం ఓవరాల్ గా ఓకె అనిపించింది(కేవలం వసూళ్ల విషయంలో) కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా కొరటాల తో ఎప్పుడో మొదలు కాబడిన ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా నిర్మాత రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కోసం వదల్లేదు.

దానికి తోడు ఈ చిత్రానికి మెగాస్టార్ కు ఎలాంటి పాటలు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయో క్షుణ్ణంగా అవపోసన పట్టిన మణిశర్మ సంగీతం ఇస్తున్నారని బజ్ వినిపించగానే ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అప్పటి నుంచి వేరే లెవెల్ కు వెళ్లిపోయాయి. ఈ వార్త కూడా వచ్చి చాలా కాలం అయ్యిపోయింది కానీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఇంత లేట్ కావడానికి కారణం ఏమయ్యి ఉండొచ్చు అన్న అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ విషయంలోనే ఎక్కువ లేట్ అవుతుందేమో అని చెప్పొచ్చు. ఇప్పటికే మణిశర్మ అని అందరికి తెలిసిపోయింది. దీనితో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య చిత్రం నుంచి అదిరిపోయే అవుట్ ఫుట్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఒకటికి పది సార్లు రీకరెక్ట్ చేసుకుంటూ పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ముందు ఫైనలైజ్ చేసేయాలని చూసి ఉండవచ్చు దాని వల్లనే చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.