కుర్రకారుని నిద్రపట్టనివ్వటం లేదా ….

సినిమాల్లేక మ‌రో అవ‌కాశం అంటూ నిర్మాత‌ల వెంట తిరిగినా ఫ‌లితంలేని  హీరోయిన్లు లో చాలా మంది ఈ మ‌ధ్య హాట్ హాట్ ఫోటోషూట్స్ తో  సోషల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తూ,   హల్ చల్ చేస్తుంటం  సర్వసాధారణమైపోయింది. ఈ త‌ర‌హాలో అయినా అవ‌కాశాలు అంది వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం వారిది.
అయితే వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న  కీయారా అద్వానీ కూడా త‌న టాప్ లెస్ ఫోజులతో సామాజిక మీడియాని  పిచ్చెక్కిస్తోంది.  ఇప్ప‌టికే బాలీవుడ్ లో వరుస విజయాలతో అగ్ర‌శ్రేణి హీరోయిన్ల లిస్టులోకి దూసుకు వెళుతోంది  కీయారా.. మంగ‌ళ‌వారం విడుదలైన ఓ సంస్థ‌ క్యాలెండర్ కోసం టాప్ లెస్ ఫోజులిచ్చేసింది  కేవలం ఒక ఆకుని అడ్డు పెట్టుకొని మ‌రీ. ఇప్పుడు . ఆమె ఒంపులు స్పష్టంగా కనిపిస్తున్న ఫోజుల‌న్నీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 
 
బాలీవుడ్  కత్రినా, దీపిక, కరీనాలు  స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందినా, కొత్త హీరోయిన్లు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో వారిప్పుడు నిర్మాత‌లు సీనియర్ హీరోయిన్స్ గా మాత్ర‌మే ప‌రిగ‌ణిస్తున్నారు. దాంతో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్న నేటి త‌రం   హీరోయిన్ ల‌లో టాప్ ప్లేస్ కోసం పోటీ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆలియా భట్ ఒక్కరే రేసులో ప్ర‌ధ‌మ‌స్థానం వైపు దూసుకుపోతున్న‌ట్టు క‌నిపిస్తున్న త‌రుణంలో నేనూ  ఈ రేసులో ఉన్నాన‌నేందుకే   కీయారా ఇలా టాప్ లెస్ ఫోజులతో రెచ్చ‌గొట్టేస్తోంద‌ని ఓ గుస‌గుస‌.  అయితే ఇలాంటి ప్లాన్ వర్కవుట్ అయ్యి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ జాబితాలో కీయారా ఎంత‌వ‌ర‌కు స్థానం అందుకుంటుందో చూడాలి. 
 

Leave a Reply

Your email address will not be published.