ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లను జారీ చేయనున్నా ప్రభుత్వం…

జనవరి 1,2020 నుండి డిసెంబర్ 21,2021 వరకు రెండేళ్ల కాలానికిగాను ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కొరకు గెజిట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం ప్రభుత్వం జారీ చేసింది.అదేవిధంగా మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్లు,నగర పంచాయతీలను యూనిట్లుగా విభజించి మద్యం దుకాణాకు లైసెన్స్ లను జారీ చేయనున్నారు.
కాగా దరఖాస్తు ఫీజులను కార్పొరేషన్లలో రూ.4.5 లక్షలు,మునిసిపాలిటీ,నగర పంచాయతీల్లో రూ.2 లక్షలు, విజయవాడ, విశాఖపట్టణాల్లో రూ.7 లక్షలుగా కేటాయించారు.ఇకపోతే లైసెన్స్ ఫీజులను ఏడాదికి రూ.5 లక్షలు నిర్ణయించారు.నేటి నుండి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఆయా జిల్లా కలెక్టర్లు లాటరీ తీయనున్నారు.అదే రోజు రాత్రి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.