మందు బాబులకు మంచి న్యూస్….మందు తాగి ఇంటికి వెళితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటా మని టెన్షన్ పడుతున్నారా, రాత్రి పదిగంటలు దాటితే  మందు షాపులు బంద్ అవుతాయని భయపడుతున్నారా, ఇకనుంచి మందుబాబులకు ఆ భయమే అక్కర్లేదు మీరు కూర్చున్న చోటుకి మందు వస్తుంది అదెలా సాధ్యం అనుకుంటున్నారా, అతి త్వరలో మీరు మీకు నచ్చిన ఆల్కహాల్ ఆల్ బ్రాండ్ ను ఆన్ లైన్ లో  ఆర్డర్ చేసి మీ ఇంటికే రప్పించుకోవచ్చు.  

ప్రభుత్వాలకు భారీ ఆదాయం అందించి పెడుతున్న ఆల్కహాల్ పరిశ్రమ ఈ కామర్స్ విభాగం పై కన్నేసింది,ఆన్ లైన్ సేవలు ప్రారంభించాలని చూస్తుంది, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మద్యం ఆన్ లైన్  అమ్మకాలు ఊహించిన దానికన్నా ముందే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ISWAI) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ తెలిపారు.  కర్ణాటకలో ఇప్పటికే  ఆన్ లైన్  అమ్మకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు, జిఎస్టి మినహాయిస్తే రాష్ట్రాలకు మధ్యమే ప్రధాన ఆదాయ వనరు అందువల్ల అనేక రాష్ట్రాలు ఈ విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వాలు మద్యం నుంచి ఆదాయాన్ని కోరుకుంటున్నాయని అయితే బాధ్యతాయుతంగా ఉండేటట్లు చట్టాలు తీసుకురాలేక పోతున్నాయని కిరణ్ తెలిపారు, ఢిల్లీ లో మద్యం కొనాలంటే 25 ఏళ్ల వయసు ఉండాలనే  నిబంధన ఉందని దీనికి 21 ఏళ్లు సరిపోతాయని అభిప్రాయ పడ్డారు, ఋగ్వేదంలోనే  మధ్యం  ప్రస్తావన ఉందని ఆయన గుర్తు చేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్కహాల్ జిఎస్టి పరిధిలోకి తీసుకు రామనే  హామీ తీసుకున్న తర్వాతనే జీఎస్టీ అమలుకు రాష్ట్రాలు అంగీకరించాయని పేర్కొన్నారు అందువల్ల జిఎస్టి కిందకి  ఆల్కహాల్ పరిశ్రమ రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

Leave a Reply

Your email address will not be published.