‘ఖైదీ’ చిత్రం హిందీ రీమేక్ ‘మగ సీసం’2019 బ్లాక్ బస్టర్ గా నిల‌చిన ఖైదీ చిత్రాన్ని ఇప్పుడు  హిందీలో రీమేక్ చేయనున్నార‌ని టాక్ వినిపిస్తోంది. కార్తీ నటించిన   ఈ ప్రాజెక్టుకు మగ సీసం  అనే పేరు కూడా ఖరారు అయిన‌ట్టు స‌మాచారం.  విజయ్ బిగిల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ  సినిమా  విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. 

కాగా ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మరియు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. కార్తీ పాత్రను అజయ్ దేవగన్ పోషించే అవకాశం ఉందని,   తమిళ చిత్రం చూసి,  కార్తీ పాత్ర‌ని హిందీ లో త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటున్న‌ట్టు స‌మాచారం . 

గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో  కార్తీ పాత్రను పోషించడానికి ‘వార్’ స్టార్ హృతిక్ రోషన్ సిద్దంగా ఉన్నాడంటూ వార్త‌లొచ్చినా అది వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. కానీ ప్ర‌స్తుతం వ‌స్తున్న అజ‌య్ విషయంలో క‌థ‌నాలు నిజ‌మేన‌నిపించేలా ఉన్నాయి.  ప్ర‌స్తుతం  విజయ్  మాస్టర్ చిత్రంతో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ ఈ రీమేక్ వెర్షన్ కు దర్శకత్వం వహిస్తారని స‌మాచారం అందుతోంది.

Leave a Reply

Your email address will not be published.