బోయపాటికి మాతృ వియోగం

మాస్ మహారాజ రవితేజ భద్ర చిత్రంలో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన బోయపాటి శ్రీను, తొలి సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. తాజాగా బాలయ్యతో హేట్రిక్ సాధించే దిశగా షూటింగ్ ఆరంభించిన బోయపాటి తల్లిగారైన శ్రీమతి బోయపాటి సీతారావమ్మ శుక్రవారం రాత్రి 7 గం.22 ని. లకు మరణించినట్టు సమాచారం అందటంతో హుఠాహుటిన ఆయన , తమ స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదకాకాని బయలు దేరి వెళ్లారు.
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి శ్రీమతి బోయపాటి సీతారావమ్మ వయస్సు 80 సంవత్సరాలు. ఆమె మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు. ఇక రేపు పెదకాకానిలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయని సన్నిహిత వర్గాలు చెపుతున్న మాట.