కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు …. దొరికిన నిందితుడు

బాంబులు తయారీ చేసి వినాశనం చేయటంతో పాటు విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆదిత్యరావు కోసం ఎంతో కాలంగా వెతుకున్న పోలీసులకు ఈ మధ్య అనూమ్యంగా కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టి దొరికి పోయాడు. అప్పటి నుంచి పోలీసుల విచారణలో ఉన్న ఆదిత్యరావు చెపుతున్న విషయాలు విని అవాక్కవ్వటం పోలీసుల వంతవుతోంది.
తాజాగా జరిపిన విచారణలలో కర్ణాటక బ్యాంకులో తన పేరిట ఉన్న ఓ లాకర్ గురించి ఆదిత్యరావు చెప్పడంతో దానని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఉడుపి పంపించారు. కోర్టు ఆదేశాలతో సదరు లాకర్ తెరచి చూసిన బ్యాంకు సిబ్బంది, పోలీసులకు నిర్ఘాంత పోయే వస్తువులు బైట పడ్డాయి. ఈ లాకర్లో ఆదిత్య తను బాంబులను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలను, సైనైడ్ ను గుర్తించారుజ ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆదిత్యరావును ఉడుపిలో విచారిస్తున్నారు