ఎస్‌బిఐ లాకర్ డిపాజిటర్లకు భారీ షాక్


దేశీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో అగ్ర‌గామిగా నిలుస్తున్న‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లాకర్ డిపాజిటర్లకు  భారీ షాక్ ఇచ్చింది. లాకర్ డిపాజిట్లకు ఉన్న కనీస ఛార్జీని రూ.500 నుంచి రూ.2వేల వరకు పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అలాగే మీడియం సైజ్ లాకర్ ఛార్జీలు రూ.1000 నుంచి రూ.4వేలు.. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ డిపాజిట్ల కనీస ఛార్జీ రూ.9 వేల రూ.12వేలకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. మెట్రో నగరాలు, పట్టణాల్లో లార్జ్ లాకర్ల అద్దె రూ.2వేల నుంచి రూ.8వేలకు పెంచేయ‌టంతో పాటు జీఎస్టీ ఛార్జీలు అదనంగా వ‌సూలు చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. ఈ పెరిగిన ఛార్జీలు మార్చి 31నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్‌బిఐ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 


ఇంతవరకు తక్కువ ఛార్జీలతో ఎస్బీఐ శాఖలు చిన్న పట్టణాలు, గ్రామాల్లో  అందించే లాకర్ సర్వీసుల సామాన్యులు కూడా వాడుకునే వారు. త‌మ విలువైన వ‌స్తువులు ఇందులో భ‌ద్ర‌ప‌రుచుకునే వారు.  అయితే ఇప్పుడు ఈ రేట్లు పెరిగటంతో ఖాతా దారుల‌లో ఆందోళ‌న వ్య‌క్తంఅవుతోంది.  దీనికి తోడు ఎస్బీఐ వన్‌-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం మీడియం లాకర్లకు రూ.500తో పాటు జీఎస్టీ.. లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్లకు రూ.1000తో పాటు అదనంగా జీఎస్టీ  విధించ‌డం గ‌మ‌నార్హం. 

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు లాకర్‌ను ఏడాదికి ఒకసారి ఆపరేట్ చేయాలి.  లేకపోతే దాన్ని బ్యాంకులు తెరిచే వీలుంది. ఇలా తెరిచే ముందు వినియోగదారులకు నోటీసులు పంపిస్తారు. ఆపై కొంత గ‌డువు త‌రువాత‌ వీటిని తెరుస్తారు.  అలాగే స‌వ‌రించిన  లాకర్ ఛార్జీలు చెల్లించకపోతే 40శాతం జరిమానా విధించ‌నున్న‌ట్టు ఎస్‌బిఐ పేర్కొన‌టం మ‌రోవిశేషం.

 

Leave a Reply

Your email address will not be published.