ట‌క్క‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల

సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన  తాజా చిత్రం టక్కర్ టైటిల్ పోస్టర్ ను  మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. గతంలో కప్పల్, పాండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో  ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. 
నివాస్ కె ప్రసన్న స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్స్ జరుపుకుంటోంది..  సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతుండ‌గా  2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 

Leave a Reply

Your email address will not be published.