కేజ్రీవాల్ పార్టీ విజ‌యం వెనుక ప్ర‌శాంత్ కిషోర్..?


హ‌స్తిన‌లో క‌మ‌ల‌నాధులు పీఠం వేయాల‌ని చూస్తే, జ‌నం స‌సేమిరా అన్నారు. స్ధానిక అంశాల‌నే ల‌క్ష్యంగా చేసుకుని బ‌రిలోకి దిగిన  ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కే ప‌ట్టం క‌ట్టారు. న్యూఢిల్లీ శాసన సభ కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అనేక హిందుత్వ నినాదాల‌తో జ‌నం ముందుకు వ‌చ్చినా బిజెపిని తిర‌స్క‌రించిన జ‌నం ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కే జ్రీవాల్‌కు తిరిగి ప‌ట్టం కొట్ట‌డంతో పాటు  . వరుసగా మూడు ఎన్నికల్లో   విజయం సాధించి  హాట్రిక్  ముఖ్య‌మంత్రిగా పీఠం అధిష్టించేలా తీర్పు ఇచ్చారు. 

 ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినా కేజ్రీవాల్ పార్టీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. న్యూఢిల్లీ ఓటర్లు ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌పై అంచెలంచెల విశ్వాసం చూపారని చెప్ప‌క‌త‌ప్ప‌దు. తొలిసారి పోటీ చేసిన 2013 శాసన సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిచిన  కేజ్రీవాల్  అధికారం అందుకునేందుకు ఆమ‌డ దూరంలో ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసారు. కానీ కాంగ్రెస్ మ‌ద్ద‌తుపై ఆ పార్టీలో వ‌చ్చిన విభేదాల‌తో దాదాపు 13 నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. దీంతో పాల‌న చేత‌కాక అసెంబ్లీని ర‌ద్దు చేసార‌న్న విమ‌ర్శ‌లు ఎన్ని ఎదుర్కొన్నా.. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేననేలా న్యూఢిల్లీ ప్రజలు మరోసారి పట్టం కట్టారు.. తాజాగా ఎన్నిక‌ల వ్యూహ దిగ్గ‌జం ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హాలు తీసుకుంటూ ఎన్నిక‌ల బ‌రిలో దిగి మ‌రోమారు విజ‌యం అందుకున్నారు కేజ్రీ. పైగా త‌న భార్య పుట్టిన రోజు నాడు ఈ విజ‌యం అందుకోవ‌టాన్ని విశేషంగా చెపుతున్నారాయ‌న‌… 
 

Leave a Reply

Your email address will not be published.