నేడే హైపర్ కమిటీ తొలి సమావేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ నేడు భేటీ కానుంది. వాస్తవానికి ఈ నెల5వ తేదీనే ఈ కమిటీ సమావేశం జరగాల్సి ఉన్నా కొందరు మంత్రులు అందుబాటులో లేక పోవడంతో 7వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికలపై ఈ కమిటీ భేటీలో అధ్యయనం చేయనున్నారు. ఈ కమిటీ జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనుంది. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉండగా అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం హై పవర్ కమిటీ తొలిసారి సమావేశం కానుండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో ఇప్పటికే మంత్రులు లీకులు ఇస్తుండటంతో ప్రజలలో ఎలాంటి టెన్షన్ కనిపించడంలేదు.