బాల‌య్య, బోయ‌పాటి కాంబినేష‌నా…? ఇక ర‌చ్చర‌చ్చే


బాలకృష్ణ, బోయపాటి కలయికలో రానున్న భారీ చిత్రం షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ను జనవరి నుంచి నిర్వహిస్తారు. ఇక తాజా సమాచారం ప్రకారం, ఇందులో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను సంప్రదిస్తున్నారట. అలాగే ఓ హీరోయిన్ పాత్రకు కన్నడ నటి రచిత రామ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.    

ఇక‌పోతే టాలీవుడ్ లో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమాను బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్‌ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో సంజయ్ దత్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట.త్వరలోనే సంజయ్ దత్‌ను కలిసి ఈ కథ వినిపించాలను కుంటున్నారు. సంజూ బాబా ఓకే చెప్పడమే తరువాయి అంటున్నారు. ఇప్పటికే సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2‌లో విలన్‌గా నటిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పానిపట్’ సినిమాలో ప్రతినాయకుడిగా మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నాడు.

ప్రస్తుతం బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ నెలాఖరికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో  బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

Leave a Reply

Your email address will not be published.