సైలెన్స్ ప్లీజ్’ అంటూ సైలెంట్ హిట్ అయ్యేందుకు!!

 బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్ద-2’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సైలెన్స్ ప్లీజ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు.  వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.
మార్చి 8న, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
 నిర్మాత- తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం ఏడెనిమిది సినిమాలకు తక్కువ కాకుండా రిలీజయ్యే ప్రస్తుత తరుణంలో.. ఈవారం కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే విడుదలవుతుండడం.. వాటిలో ‘సైలెన్స్ ప్లీజ్’ పెద్ద సినిమా కావడం కూడా కలిసి రానుంది. ‘సైలెన్స్ ప్లీజ్’ కచ్చితంగా సైలెంట్ హిట్ అవుతుందనే గట్టి నమ్మకం మా అందరిలోనూ ఉంది..  అన్నారు!!

Leave a Reply

Your email address will not be published.