సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు

చక్రబంధం సీరియల్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకొన్న నటి నాగఘాన్సి బలవన్మరణం చత్ర పరిశ్రమలోని వారిని కలవరపర్చింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియటం ఎందరినో ఆవేదన కల్గించింది. నటిగా ఎంతో ఎత్తుకు ఎదగాలని చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఝాన్సీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవటం సరికాదనిపించింది. జీవితంలో సమస్యలు వస్తాయి. ఇవి ఏదో ఓ సమయంలో అందరి అనుభవంలోకి వచ్చేవే సమస్య ఎంత తీవ్రమైనది అయినా దానికో పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు సమాజం ఎంతో చైతన్యవంతంగా ప్రకాశిస్తుంది. ఏ సమస్య అయినా చిటికెలో పరిస్కరించుకోగల్గేంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. మన సమస్యకు పరిష్కారం మనకు సరిగ్గా లభించనప్పుడు తల్లిదండ్రులు అందుబాటులో లేనప్పుడు చెప్పగలిగే స్నేహితులు దూరంగా ఇప్పుడు సోషల్ మీడియా అడుగు దూరంలో ఉంది. ముక్కు మొఖం తెలియకపోయినా ఒరిజినల్‌గా మన పేర్లు వెల్లడించలేకపోయినా సమస్యను తెలుపుతూ దానికో పరిష్కారం చెప్పండని అడిగితే చెప్పగల్గే స్వహృదయులు ఎందరో ఉన్నారు. రకరకాల పరిష్కారాలతో పాటు ధైర్యం నూరిపోస్తూ సపోర్ట్‌గా నిలిచే అన్నదమ్ములెందరో ఉండగా. అక్క చెల్లెళ్లు మరెందరో ఉన్నారు.
అయినా యువత ఆలోచించలేకపోతోంది. వారి పై పడుతున్న విషసభృతి నిడుప్రభావం వారిని పెడద్రోవ పట్టిస్తుంది. మృగాళ్లలో రగులుతున్న ఉన్మాద చర్యలకు ముక్కుపచ్చలారని చిన్నారియువతులు బలైపోతున్నారు. మితిమీరిన భావోద్వేగానికి గురవుతున్నారు. వారి కొందరు యువతులు మానసిక వ్యధకు గురవుతున్నారు బాల్యదశనుండి కౌమార దశకు వచ్చేటప్పటికి ప్రేమ యువతను కవ్విస్తుంది. మదిని మైమరిపిస్తుంది. తీయని అనుభూతిని కలిగిస్తుంది. నిస్ధార్ధమైన త్యాగాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పడదే ప్రేమ మరణాన్ని కోరుకొంటుదని సమాజం నివ్వెర పోతుంది. కలవరపెడుతుంది. ఆకర్షణీ ప్రేమనుకొని అదే జీవితమనుకొని హత్యలకు వెనుకాడటం లేదు. ఆత్మహత్యలకు వెనవరటంలేదు ఏది నిజమైన ప్రేమో? ఏది ఆకర్షణా, ఏది మాయాజాలమో? ఏది స్వార్ధపూరిత వంచనో తెలుసుకోలేని స్థితికి యువత నెట్టబడుతుంది అవే జీవితమనుకొని దక్కకపోతే మరో మార్ం లేదని ఉన్మాదుల్లామారుతున్నారు. బలవనర్మాలకు పాల్పడుతున్నారు. యువత చుట్టూ సుడులుగా తిరుగుతున్న ప్రేమబ్రమల్నించి వారిని బయటకు లాగే దెవరు? ఇప్పుడదే ప్రశ్నగా మారింది. ఎప్పుడూ అంటి పెట్టుకొని స్నేహితులు వారిని ఎడ్యుకేట్ చేయాలి. సమస్య వస్తే పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలి తప్ప ఆత్మహత్య చేసుకోకూడదనే విషయాల్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. నిండు నూరేళ్లు జీవించాలి. అదే సమాజ ధర్మం. మనందరి కర్తవ్యం.