గోడ మీద వార్తలు

గోడ మీద వార్తలు
18 – 01 – 2019

01 అసమ్మతి – రాజకీయ వ్యతిరేకులని అణిచి  వేసేందుకు వాడుతున్న దేశద్రోహ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి – సీపీఎం …

తల్లిపాలు త్రాగి – ఆకలి తీరాక నీయమ్మ అనే నా డాష్ ల మీద ప్రయోగించటంలో తప్పేం లేదులే బాబాయ్ – మరీ చలికాలంలో కూడా గొడుగులేసుకు తిరక్కండి…!!

02. జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలటంతో డేరా బాబాకు జీవిత ఖైదు విధించిన – సీబీఐ కోర్టు…

ఇట్టాంటి ఎదవలని జైల్లో పెట్టి మేపేకన్నా ఆ సొమ్ముతో అనాథ పిల్లల కడుపు నింపితే బెటరు – తిండి దండగ తీర్పులూ మీరూ…!!

03. ఇప్పుడు జగన్ని విమర్శిస్తున్న తెదేపా వారంతా అమరావతి శిలాఫలకం పై పెద్ద పెద్ద అక్షరాలతో కేసీఆర్ పేరు చెక్కినప్పుడు ఎందుకు మాట్లాడలేదు  – వైకాపా మహిళానేత రోజా …

లాజిక్ తో లాగిపెట్టికొట్టావోలప్ప – పండక్కి కొత్తవి కొన్నట్టున్నావు – ఏ బ్రాండేటీ…???

04. ఈ దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు ఓ మాఫియా లా తయారయ్యాయి – గవర్నర్ నరసింహన్ …

అనారోగ్యశ్రీలాంటి పథకాలెట్టి పావలాకి ముచ్చావకా బిల్లులు సాంక్షను చేసి  ప్రోత్సహిస్తంటే తయారవక బ్రతుకుతాయా బాబాయ్ ..??

05. ప్రస్తుత భాజపా నేత పురంధరేశ్వరికి ప్రమోషన్ – ఏపీ లో భాజపా ఎన్నికల వ్యవహారాల బాధ్యతలు అప్పగించిన – అధిష్టానం…

ఏపీ ఎన్నికల అధికారి ఆకస్మిక బదిలీ – ఆ స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదీ నియామకం …!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!

Leave a Reply

Your email address will not be published.