పొత్తూరి వెంకటేశ్వరరావు ఇకలేరుప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం ఉద‌యం  కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన త‌న నివాసంలో మ‌ర‌ణించిన‌ట్టు కుటుంబ స‌భ్యులు చెప్పారు. 
1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన వెంకటేశ్వరరావు.. 1957లో ఆంధ్ర జనతా పత్రిక లో చేరి త‌న పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు. ఆంధ్ర‌ప్ర‌భ ఎడిట‌ర్‌గా ఆయ‌న రాసిన వ్యాసాల‌ను అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా చ‌దివేవార‌న్నది ప్ర‌తీతి పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా పొత్తూరి విశేష సేవలందించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.  పాత్రికేయంపై ఆయ‌న‌ అనేక పుస్తకాలు రచించారు. నాటి పత్రికల మేటి విలువలు పుస్తకం  చింతన, చిరస్మరణీయులు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

పొత్తూరి మ‌ర‌ణంపై జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో పాటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న సంతాపాన్ని ప్ర‌క‌టించారు. జర్నలిజంలో  పితామహుడిని కోల్పోయింద‌ని ప‌లువురు కొనియాడారు. 

 

Leave a Reply

Your email address will not be published.