వాళ్లు వెర్రివెధవలేనంటున్న వర్మ
ఏ సినిమా దర్శకుడయినా చాలా కష్టపడి మంచి సినిమానే తీయాలనుకుంటాడుగానీ చెత్త సినిమా తీయాలని అనుకోడు కదా? ఒక వేళ అలా ఆలోచిస్తే, వాళ్లంతా వెర్రి వెధవలు ఎవరూ ఉండరంటున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఓ టివి ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాగే నేను చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేరన్నారు. నయీం, శశికళ సినిమాలు ప్రస్తుతం తనకు లేదని, ఓ సినిమా ప్రకటించిన చేయకపోవడం అంటే నేనేదో మాటపై నిలబడలేదని అర్థం కాదు. నయీం, శశికళతో పాటు నాకు గుర్తు లేని మరో పది చిత్రాల వరకు ఉన్నాయని చెప్పాడు.
నా బుర్రలో తట్టే చాలా అంశాలపై చాలా మందితో విషయాలను చర్చిస్తుంటాం, ఆ క్రమంలో ఏర్పడే కథలే సినిమాలుగా చేస్తానని చెప్పారు. నా పరిధిలోకి వస్తే నేను సినిమాలు గురించి చర్చిస్తున్నప్పుడు ఆ ఐడియాలు అలా వచ్చే ఐడియాలన్నీ సినిమాలు చేయనవసరం లేదు కదా? అన్నారు. అలాగే నయీం, శశికళతో పాటు మరో పది సినిమాలు రావచ్చు … రాకపోవ చ్చంటూ చెప్పుకొచ్చాడు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.