కన్నడంలో ఘన విజయం సాధించి తెలుగు లో దర్శకుడిగా హారి సంతోష్…

రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్.  కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ  సినిమాతో తెలుగు లో దర్శకుడిగా హారి సంతోష్.పరిచయం అవుతుండ‌గా నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ  చిత్రానికి సంబంధించిన‌ ట్రైలర్ సాయి కుమార్ చేతులు మీదుగా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ… విజయ్ మాస్టార్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి మరింత హ్యాపిగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది, అలాగే ఎమోషన్స్ బాగున్నాయి కాలేజ్ కుమార్ సినిమాను ప్రతి తండ్రి కనెక్ట్ అవుతారు. నేను ఈ సినిమాలో ఒక మంచి పాత్ర చెయ్యాల్సి ఉంది, కానీ కుదరలేదు, ఆ పాత్రను నా తమ్ముడు రవి చేసాడు చిత్రం విజయం అందుకోవాల‌ని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.