సెల్లు కొంటె ఉల్లి ఉచితం


ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉల్లిపాయలకు రెక్కలు రావ‌ట‌టంతో కేజీ ధ‌ర సెంచ‌రీ దాటేసింది. రోజురోజుకు ఆకాశాన్నిఅంటుతున్న నేప‌థ్యంలో సామాజికి మీడియాలో ఈ విష‌యంపై సెటైర్లు, టిక్ టాక్‌లో ప‌లు వీడియోలు ద‌ర్శ‌న మిస్తున్నాయి. చివరికి విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా ఆ ఉల్లిపాయలు అందరికి అందడం లేదని చెప్పాలి. పోనీ  ధర ఎక్కువైనా సరే కొనుకుందామనుకుం టే కొన్ని చోట్ల ఉల్లిపాయలు కనిపించడమే కరువయ్యాయి.

దీన్నే త‌న బిజినెస్ కి అనువుగా మార్చుకుంటున్నారు కొంద‌రు. ఈ నేపథ్యంలో తంజావూరు లోని ఒక ఫోన్లు అమ్మే దుకాణం ఒక అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. తమ షాపులో స్మార్ట్ ఫోన్ కొన్న వారికి కిలో ఉల్లిపాయలు ఫ్రీ అని ప్రకటనలు చేసింది. దీంతో ఇప్పుడు ఉల్లిపాయల కోసం ప్రజలు స్మార్ట్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని నొస‌ళ్లు నొక్కుకుంటున్నాడు.ప్రస్తుతానికి ఈ వీడియో కాస్త వైరల్ గా మారిందని చెప్పాలి. రాను రాను ఇలాంటి విచిత్రాలు ఇంకా ఎన్ని చూడాలి వస్తుందో మరి…

Leave a Reply

Your email address will not be published.