పెళ్ల‌య్యి రెండు నెల‌ల‌కే… ఆమె ….

హైదరాబాద్‌ శివారులో ఉన్న వనస్థలిపురంలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘ‌టన  శుక్రవారం చోటుచేసుకుంది.  ఇందుకు సంబంధించిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మలక్‌పేటకు చెందిన పల్లవి(28) ఎంబీఏ పూర్తి చేసిన అనంత‌రం కుటుంబ స‌భ్యుల నిర్న‌యంతో వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సోమవరం సంతోష్‌ని వివాహం చేసుకుంది.  స్థానికంగా ఓ గ్యాస్‌ ఏజెన్సీనిర్వ‌హిస్తున్న సంతోష్‌తో గత ఏడాది డిసెంబర్ 8 జ‌రిగిన వీరి వివాహ సంద‌ర్భంలో క‌ట్నంగా ఒక లక్ష రూపాయలు, పెళ్లి కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసిన ప‌ల్ల‌వి గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహణలో భ‌ర్త‌కు త‌న స‌హ‌కారం అందించేంది. వ్యాపారం నిమిత్తం గురువారం సంతోష్  వేరే ప్రాంతానికి వెళ్లగా … శుక్రవారం ఉదయం అనారోగ్యంతో  ఆమె అత్తమామలు వైద్య‌సేవ‌ల‌కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆసుప్ర‌తిలో కావాల్సిన వివ‌రాలు అంద‌జేయ‌టంలో స‌త‌మ‌త‌మై త‌మ కోడ‌లు పల్లవితో మాట్లాడాలంటూ పలుమార్లు ఫోన్ చేసారు. ఆమె ఫోన్ ఎత్త‌క పోవ‌టంతో పొరుగువారికి ఫోన్‌ చేసి తన కోడలు పల్లవిని పిలవాల్సిందిగా కోరారు.  అయితే వారు ఇంటి త‌లుపులు మూసి ఉన్నాయ‌ని, పిల‌చినా ఎవ‌రూ ప‌ల‌క‌టం లేదంటూ చెప్ప‌డంతో హుఠాహుటిన ఇంటికి చేరుకున్నారు. 
ఇరుగుపోరుగు వారి సాయంతో త‌లుపులు బ‌ద్ద‌ల‌గొట్టి ఇంట్లోకి ప్ర‌వేశించ‌గా  ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన  ప‌ల్ల‌వి క‌నిపించింది. ఈ విష‌యంపై స‌మాచారం పోలీసుల‌కు చేర‌టంతో ఘటనా స్థలానికి చేరుకున్న వివరాలు సేకరించారు. 
అత్తారింటికి వెళ్లిన ఆమె నెలన్నరకే బలవన్మరణానికి పాల్పడ‌టంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌ల్ల‌వి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తెలియాల్సి ఉండ‌గా, భ‌ర్త అత్త‌మామ‌ల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.  అయితే పల్లవి తల్లిదండ్రులు మాత్రం ప‌ల్ల‌వి భర్త కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తు వారి కార‌ణంగానే త‌మ కుమార్తె చ‌నిపోయిన‌ట్టు ఆరోపిస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published.