గోడ మీద వార్తలు

                                                                             30 – 11 – 2019
01 . ప్రియాంక కేసుని నేనే పర్యవేక్షిస్తా – బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాం – కేటీఆర్ …
 
సత్వర న్యాయం అంటే ఏంటి భయ్యా ..?? ఎదవలని జైల్లో పెట్టి దున్నపోతుల్లా మేపటమా లేక ఫేమిలీకి ఓ ఐదో పదో , ప్రభుత్వుద్యోగమో ప్రకటించి చేతులు దులిపేస్కోటమా.. ??
02. నెల్లూరు జిల్లాలో ఓ మైనరు బాలికని అత్యాచారం చేసిన వ్యక్తిని జీవించి ఉన్నంత కాలం జైలులోనే ఉంచాలని ఆదేశించిన – కోర్టు …
మంచిది – వారం వారం కోడి పలావు – మంత్లీ మెడికల్ చెకప్పుతో ఎదవలని బాగా చూస్కోండి – వెర్రి జనం పన్నులు కడుతోంది ఇట్టాంటి అడ్డగాడిదలని మేపటానికేగా…!!
03. మహిళలకి రక్షణ లేకుండా పోయింది – ప్రియాంక హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – ప్రస్తుత భాజపా నేత డీకే అరుణ …
కచ్ఛితంగా మేడం – కేంద్రంలో ఉన్నది తమరి ప్రభుత్వమే – హత్య జరిగిందీ కూడా ఈ దేశం లోనే వెంటనే బాధ్యత తీస్కుని ఎందులోనైనా దూకి సావమనండి…!!
04. ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయిన భారతదేశ జీడీపీ – ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ క్వార్టరులో 4.5% గా నమోదైనట్టు ప్రకటించిన – ఆర్ధిక శాఖ  …
రేయ్ – ఆ నాలుక్కీ – ఐదుకీ మధ్యనున్న చుక్క తీసేసి పోష్టర్లచ్చేయండ్రా – హాఫ్ సెంచురీకి దగ్గర్లో ఉన్నామని చంకలు గుద్దుకుంటారు భక్తాయిలు …!!
05. వచ్చే ఏడాది నుండీ డిగ్రీ కాల వ్యవధి నాలుగేళ్ళు – బీటెక్ కి ఐదేళ్ళుగా నిర్ణయించిన ప్రభుత్వం – కోర్సు పూర్తయ్యాక ఓ ఏడాది అప్రంటీస్ చేయించాలని ఆలోచన …
శభాష్ – కాలేజీలకి ఓ ఏడాది ఫీజు దొరుకుద్ది – తలితండ్రులకి మరో ఏడాది భారం పెరుగుద్ది – అంతకన్నా ఒరిగేదేం ఉండదు  …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.