గోడ మీద వార్తలు

01 రాష్ట్రానికెన్నో ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయ్ – వాటితో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడి ఎదగాలి – మంత్రి గంటా …
సర్లే గానీ –  ఇంతకీ ఆ ప్రైవేటు సర్టిఫికేట్లన్నీ పని కొస్తాయా లేక ఓ పదేళ్ళు నిద్దరోయాక లేచి ముఖం కడుక్కుని నాలిక్కరుచుకుంటారా సామీ…??
02. జగన్ అన్ని యాత్రలూ చేసేసాడు – చివరికి అతనికి కాశీ యాత్రొకటే మిగిలింది – మంత్రి దేవినేని …
మీ సెటైరు స్వీడనెళ్ళ – పట్టిసీమ పుణ్యమాని గోదారి నీరు బాగా ఒంటబట్టినట్టుందే –  ఐనా కాశీయాత్రకి పోతే బెల్లమ్ముక్కెట్టి బతిమాలడానికి ఆయన ఏమన్నా బెమ్మచారా..?? ఏకపత్నీవ్రతుడైన భారతీపతి గానీ ..!!
03. ఏపీ భాజపాని ఒక్కొక్కరిగా వీడిపోతున్న నేతలు – పురంధరేశ్వరి వైకాపా – మిగిలిన వారు తెదేపా జనసేనల్లో సర్దుకుంటాలని వార్తలు …
ఉన్న పుంజిడు మందీ వీడిపోయినా సరే – ఈర్రాజు మాయ్యొక్కడుంటే చాలు – జనరిక్ స్టోర్ లో బీపీ బిల్లలు అమ్ముడుపోడానికి…!!
04. పాదయత్రలన్నీ పూర్తవటంతో కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న – జగన్ …
హేవిఁటో – నాస్తిక సభలని కొబ్బరికాయ కొట్టి ఆరంభించినంత చిత్రంగా ఉంది యవ్వారం…!!
05. సుప్రీం కోర్టు వరమిచ్చిన 24 గంటలు గడవక ముందే సీబీఐ డైరక్టరు అలోక్ వర్మని పదవి నుండి పీకేసిన – హై పవర్ కమిటీ ..
యవ్వారం సూత్తంటే భక్తాయిలకి కూడా మింగుడు పడని బ్రహ్మపదార్ధమేదో వండి వార్చి అస్మదియులకి ఆకుల్లో వడ్డిస్తన్నట్టే ఉంది …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”  
:||: జై హింద్

Leave a Reply

Your email address will not be published.