`తోట‌బావి` చిత్రం టీజర్ విడుదల




గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `తోట‌బావి`. యాంక‌ర్ ర‌వి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో గౌత‌మి హీరోయిన్ గా  న‌టిస్తోంది.  ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ శ‌నివారం విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ – “దర్శకుడు మంచి విజన్ తో తెరకెక్కించాడని టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.  మంచి టైమింగ్ ఉన్న నటుడు రవిని చాలా కాలంగా టెలివిజన్ లో చూస్తున్నాం . `తోట‌బావి`. టైటిల్ చాలా కొత్త‌గా ఉంది. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హీరోకి  మంచి పేరు తీసుకరావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

ద‌ర్శ‌కుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ…“  టీజర్ ను దర్శకుడు ఎన్. శంకర్ గారు విదలచేయడం హ్యాపీగా ఉంది. హీరో ర‌వి స‌పోర్ట్ తో  బాగా వచ్చింది. నిర్మాత‌లు అన్ని సమకూర్చి నాకు స‌హ‌క‌రించారు.   “ అన్నారు.

నిర్మాత ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ మాట్లాడుతూ..“ మా మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాకి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో కొత్త కాన్సెప్ట్ తో  ఇంట్ర‌స్టింగ్ ఉంటుంది.  మొదటి సినిమా అయినా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా చక్కగా తెర‌కెక్కించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం “ అన్నారు.
 

Leave a Reply

Your email address will not be published.