ముచ్చటగా మూడో సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ట

నందమూరి నటసింహం బాలకృష్ట బోయపాటి  శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలయికలో సింహ.. లెజండ్ ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది. ఈసినిమాపై అభిమానులు చాలా అంచానాలు పెట్టుకున్నారు. బాలయ్యను  పవర్ ఫుల్ పాత్రలోచూపించేందుకు బోయపాటి కథను పక్కాగా రాసుకున్నాడు. అయితే ఈచిత్రానికి క్యాథరిన్ ఫైనల్ అయిందనే పలు పుకార్లు వచ్చాయి.   ఆమె పారితోషికం, కాల్షీట్లు లేవనే సాకుతో ఈసినిమా నుంచి తప్పుకుంది.  ని ఆమె స్థానంలో అంజలిని తీసుకున్నట్లు తెలుస్తోంది. 
అంజలి ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాకుండా  లేడీ ఓరియంటేడ్ చిత్రాల్లోనూ నటించారు. ఈ మధ్య అవకాశాలు తగ్గినా తను నిరుత్సాహ పడకుండా వచ్చిన సినిమాలను చేసుకుంటు వెళ్తోంది.   మరిన్ని అవకాశాల కోసం బరువు కూడా తగ్గింది. తెలుగు నుంచి ఒక భారీ సినిమా ఛాన్స్ కోసం అంజలి ఎదురుచూస్తోంది. 

అయితే బోయపాటి సినిమాలో క్యాథరిన్ ఫైనల్ కాకపోవడంతో అంజలిని ఈసినిమాలో  ఎంపిక చేశే అవకాశం ఉంది. బాలకృష్టతో అంజలి ఇప్పటికె డిక్టేటర్ చిత్రంలో ఆడిపాడింది.  వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను దర్శకుడు ప్రారంభించనున్నారు.  ఈ సినిమాలో కథానాయికగా అంజలిని తీసుకుంటేనే కథకు ఆమె న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.  ఈచిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published.