తాజ్ మహల్ కు ట్రంప్ దంపతులు

భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు    ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను సందర్శించారు. అహ్మ‌దాబాద్ ప‌ర్య‌ట‌న ముగించుకుని వారు నేరుగా తాజ్ మహల్ అందాలను తిల‌కించేందుకు వెళ్లారు. చాలా ఆసక్తిగా తాజ్ విశేషాలను స్థానిక గైడ్ ను అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు.అణువూ పుల‌క‌రించి పోయారు. చేతిలో చేయి వేసుకొని తాజ్ మహల్ చుట్టూ కలియ తిరుగుతూ తాజ్ అందాలను ఆస్వాదించి,  మంత్రముగ్ధుల య్యారు.  తాజ్ వెనుక భాగంలో ఉన్న యమునా నదిని కూడా ట్రంప్ దంపతులు వీక్షించారు. తాజ్ అందాలు చూసి ముగ్ధులయ్యారు ట్రంప్ దంపతులు. పర్యటనకు గుర్తుగా సందర్శకుల బుక్ లో ఓ సందేశం రాసి సంతకం పెట్టారు ట్రంప్ దంపతులు. 

మ‌రోవైపు ట్రంప్ కూతురు ఇవాంకా,అల్లుడు కుష్నార్ కూడా తాజ్ అందాలను ప‌రిశీలించారు. ప్రేమ కోసం ఓ రాజు ఇంత‌టి అద్భుత క‌ట్ట‌డం క‌ట్టిన‌ట్టు ప‌త్రిక‌ల‌లో, వివిధ వ్యాసాల‌లో చ‌దివాను కానీ ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న అనుభ‌వం వేరుగా ఉంద‌ని ఇవాంక త‌న ఉద్వేగాన్ని మీడియాతో పంచుకోవ‌టం విశేషం. 

Leave a Reply

Your email address will not be published.