“ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్….మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన క‌థానాయిక‌గా న‌టిస్తున్నఈ చిత్రం షూటింగ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత రాజేష్‌ నాయుడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ – “ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామ‌ని హీరో పవన్‌ తేజ్‌ కొణిదెల నటుడిలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దర్శకుడు అభిరామ్ చిత్రీక‌ర‌ణ బాగుంద‌ని, , ‘ఆర్‌ఎక్స్‌ 100′, ‘కల్కి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ డైలాగ్స్ కు క్లాప్స్ ప‌డ‌తాయ‌ని” అన్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి వేస‌విలో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌మ‌ని చెప్పారు.


Leave a Reply

Your email address will not be published.