తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి పద్మభూషణ్ …

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పద్మభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మ భూషణ్‌, 118 మందికి పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మభూషణ్‌ పురస్కారం దక్కింది.  వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.  ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను కేంద్రం  ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. 
మరణానంతరం జార్జి ఫెర్నాండెస్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, విశ్వేశ్వతీర్థ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించింది. పీవీ సింధుకు పద్మభూషణ్ ప్రకటించడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published.