సాక్షి, భార‌తి గురించి మాట్లాడ‌దామా? చంద్రబాబు సవాల్ !

అసెంబ్లీలో ప‌దే ప‌దే హెరిటేజ్‌’ సంస్థపై పై వైసిపి స‌భ్యులు ఆరోప‌ణ చేస్తున్న క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ అధినేత విప‌క్ష నేత చంద్ర‌బాబు స్పందించారు. గ‌త ప్ర‌భుత్వ‌ హయాంలో ఇలాంటి సమస్య వస్తే చౌక దుకాణాల ద్వారా కార్డుకు రెండు కిలోలు చొప్పున ఉల్లిని ప్ర‌జ‌ల‌కు విక్రయించిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఊరంతటనీ ఉల్లి కోసం రైతు బజారు వద్దకు రమ్మంటున్నారు. క్యూ లైన్ల‌లో నిల‌బెడుతున్నారు. తీరా ఇచ్చేందుకు స‌వాల‌క్ష నిబంధ‌న‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుడివాడలో ఉల్లి పంపిణీ క్యూలైన్లో గుండె పోటుతో ఒక వ్యక్తి మరణించిన విష‌యాన్ని చంద్రబాబు చెప్పారు.
ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు చెందిన‌ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.135- రూ.200ల‌కు అమ్ముతున్నారంటూ వైసీపీ సభ్యులు చంద్ర‌బాబుపై ఎదురుదాడికి దిగారు. హోంమంత్రి కూడా హెరిటేజ్ నుంచి బ్ర‌హ్మిణి త‌మ‌కు స్వీట్ బాక్సులు పంపార‌ని ఇది ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు కుటుంబానిదేన‌ని ఖ‌రారు చేయ‌టంపై చంద్రబాబు మండి ప‌డ్డారు.
హెరిటేజ్ ఫ్రెష్‌కి, హెరిటేజ్ ఫుడ్‌కి తేడాలు తెలియ‌ని మంత్రి నోటికొచ్చిన ఆరోప‌ణ‌లు చేయ‌టం ఏంట‌ని నిల‌దీసారు. రెండూ వేర్వేరు సంస్ధ‌ల‌ని, హెరిటేజ్‌ ప్రెష్‌ ప్యూచర్‌ గ్రూప్‌ సంస్థకు చాలా కాలం క్రిత‌మే అమ్మేసిన విష‌యం కూడా తెలియ‌ని వారు మంత్రులుగా త‌మ మేధావిత‌నం వెలిబుచ్చుతున్నార‌ని మండి ప‌డ్డారు. హెరిటేజ్ విష‌యాల‌ని స‌భ‌లో వైసిపి ప్ర‌స్తావిస్తే, భారతి సిమెంట్‌, సాక్షి పేపర్‌, సోలార్‌ విండ్‌పవర్‌పై మేం కూడా మాట్లాడుతాం. మీ అందరి విషయాలు కూడా ప్రజలకు తెలియాలి క‌దా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.