ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు లో సిబిఐ మరో ముందడుగు





రాజధాని భూముల వ్యవహారం లో  ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిఐడి అధికారులు విచారణను ముమ్మరం చేశారు, ఇందులో భాగంగా శుక్రవారం ఒకేరోజు ఏడుగురిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు, తాజాగా నమోదైన కేసులో అబ్దుల్ జమేదార్, బొల్లినేని కొండలరావు, మండవ నాగమణి,మండవ  అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్య నాగమణి, ఉన్నట్టు తెలుస్తుంది, వీరంతా తెల్ల రేషన్ కార్డు దారుల పేర్లతో కోట్ల రూపాయల విలువైన భూములు కొన్నట్లు సిఐడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు గా తెలిసింది. 


 రాజధాని ప్రాంతంలో 791 తెల్లరేషన్ కార్డుదారులను వాడుకుని కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు గా వైసీపీ  ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే, తాజా కేసులతో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లు గా తెలుస్తుంది.  రాజధాని ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాల మేరకు టిడిపి నేతలు వారి సన్నిహితులు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడినట్లుగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది, ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ పత్తిపాటి పుల్లారావు లపై కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు తాజా కేసులతో టీడీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నారు . 

Leave a Reply

Your email address will not be published.