జీ తెలుగు స్పెషల్‌ కాన్సెప్ట్‌ వీడియోలో మహేశ్‌బాబు

తెలుగునాట త‌న‌దైన శైలిలో వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌ జీ తెలుగు   మరో మూడు సరికొత్త సీరియల్స్‌ని ప్రేక్షకుల కోసం సిద్ధం చేసింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూడు సీరియల్స్‌తో ఆడియన్స్‌కు అంతులేని వినోదాన్ని అందిస్తాయ‌ని ప్ర‌క‌టించింది.

జీ తెలుగులో లాంచ్‌ కాబోతున్న సీరియల్‌లో వెంకట్‌ శ్రీరామ్‌, వర్షా హెచ్‌కే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఆషికా గోపాల్‌ పడుకునే త్రినయని సీరియల్‌లో లీడ్‌రోల్‌లో నటించింది. తూర్పు పడమర సీరియల్‌లో యామిని, జయాకవి, ప్రణయ్‌, వినయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

త్వరలో మొదలు కాబోయే కొత్త సీరియల్స్  ప్రేమ ఎంత మధురం,  త్రినయని,  తూర్పు పడమర ల   విశేషాలని ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌ టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తీసుకున్నారు.  ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్‌ వీడియోని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో చిత్రీకరించారు.  ఇందులో సూపర్‌స్టార్‌ మహేశ్‌తో సహా మూడు సీరియల్‌ నటీనటులు, యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్‌ వీడియో ఈ సంక్రాంతికి జీ తెలుగులో ప్రసారం కానుంది. అలాగే ప్రేక్షకులు ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న థియేటర్లలో వీక్షించవచ్చు.

Leave a Reply

Your email address will not be published.