`ఢీ` టీమ్ లాంచ్ చేసిన `సాఫ్ట్వేర్ సుధీర్` ట్రైలర్!!

నటి పూర్ణ మాట్లాడుతూ – “ట్రైలర్ చాలా బాగుంది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ‘అన్నారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – “కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ పలికించగల సుధీర్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సుధీర్ మంచి డాన్సర్ కూడా..ట్రైలర్ లో కూడా డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
ప్రదీప్ మాట్లాడుతూ – “సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కొత్తగా ఉంది. సుధీర్ కామెడీ టైమింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే..ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ‘అన్నారు
రష్మీ మాట్లాడుతూ – ” టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్ గా ఉంది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. డైలాగ్స్ ట్రెండీ గా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్
అవ్వాలని కోరుకుంటున్నా. రాజశేఖర్ గారి టేకింగ్ చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇది ఫస్ట్ మూవీ. తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ – ” జబర్దస్త్ షో లో కమెడియన్స్ చాలా మంది ఉన్నాం కానీ హీరో మెటీరియల్ మాత్రం సుధీర్ ఒక్కడే. సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి డాన్సులు, ఫైట్స్ చేశాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
యాంకర్ వర్షిణి మాట్లాడుతూ – ” సాఫ్ట్ వేర్ సుధీర్ ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ముఖ్యంగా సుధీర్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాతో సుధీర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు” అన్నారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ – ” మా సినిమాలోని మొదటి పాటను జబర్దస్త్ టీమ్ విడుదల చేసింది. ఇప్పుడు మా మూవీ ట్రైలర్ ను ‘ఢీ’ టీమ్ తో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా అమ్మ నాన్న లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా”అన్నారు.
దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల మాట్లాడుతూ – ” మా ట్రైలర్ లాంచ్ చేసిన చిన్ని ప్రకాష్ మాస్టర్ కి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ సాధిస్తాం” అన్నారు.
చిత్ర నిర్మాత కె. శేఖర్ రాజు మాట్లాడుతూ – ”మా బేనర్ లో ఫస్ట్ మూవీ. కథ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. సుధీర్గారిని మా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్ లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.