షూటింగ్లో గాయాల పాలైన అఖిల్

గత కొన్ని రోజులుగా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో హీరోగా నటిస్తున్న అఖిల్ అక్కినేని గాయాల పాలైనట్టు సమాచారం . యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అఖిల్ జారిపడ్డాడని, దీంతో మోచేయి భాగం బాగా వాయటంతో గత నాలుగు రోజులు గా షూటింగ్ నిలపి వేసినట్టు తెలియవచ్చింది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందనా తెలియజేసేందుకు అందుబాటులోకి రాలేదు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్నఈ చిత్ర షూటింగ్లో అఖిల్ గాయపడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నా, యూనిట్ స్పందించడంలేదు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, తాజాగా అఖిల్‌కి ప్రమాదం జరగటంతో ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తామని ముందుగా చిత్ర యూనిట్ భావించినప్పటికీ మే నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.