విశాఖ కు పరిపాలన రాజధాని అవసరం ఎందుకు లేదు

 

లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ప్రయత్నం  గమనించే రాజధాని మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించింద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జాధ‌నాన్ని మేసేటందుకు  రాజ‌ధాని మాటున చంద్ర‌బాబు భారీ ప్రణాళిక వేశారని, దాని నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా తాము గ‌త ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నామ‌ని అన్నారు.  త‌న స్లాన్ పార‌క పోవ‌టంతో కొత్త ఎత్తులు వేసి ప్ర‌జ‌ల‌ని అయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. 
 తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని,  అధికార వికేంద్రీకరణ ద్వారానే . అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయన్న వాస్త‌వాన్ని తెలుగుదేశం పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక పోవ‌టున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పేరుతో కొత్త మోసానికి తెర‌లేపార‌ని, అది ఎందుకు చేస్తున్నారో కనీసం ఆ పార్టీ నేతలు కూడా  అర్థం కావడం లేదంటున్నార‌ని వ్యంగ్యంగా అన్నారు. 
విశాఖను రాజధాని చేయమని ఎవరు అడిగారని  విమ‌ర్శ‌లు చేస్తున్న వారు గ‌మ‌నించాలి… ఉత్త‌రాంధ్రాలాంటి వెనుక‌బ‌డిన ప్రాంతంలో విశాఖ కు పరిపాలన రాజధాని అవసరం ఎందుకు లేదో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

Leave a Reply

Your email address will not be published.