వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ , రష్మిక మందన్న జంట‌గా


యువ నటుడు నితిన్ , రష్మిక మందన్న  జంట‌గా  ఛలో తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. తార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో తెరెక్కుతున్న ఈ సినిమా  టీజర్ ని  సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.

ఈ టీజర్ కామెడీ డైలాగ్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ తో అదిరిపోయిందనే చెప్పాలి. ‘స్పీడ్ గా వెళ్లే స్కూటర్ కి మేకు గుచ్చుకున్నట్లు, నువ్వు నాకు గుచ్చుకున్నావేంటిరా’ అంటూ వెన్నెల కిశోర్ చెప్పే ఫన్నీ డైలాగ్ తో పాటు, ‘నా అదృష్టం ఆవగింజంత ఉంటె దురదృష్టం దబ్బకాయంత ఉందండి’, ‘ఎవరి వేల్యూ అయినా బ్రతికి ఉన్నపుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది భయ్యా, ఒక కోడి బ్రతికి ఉన్నపుడు తొంభై రూపాయలు, అది చనిపోయినపుడు అయితే నూట తొంబై రూపాయలు ఉంటుంది కదా’ అంటూ నితిన్ చెప్పే ఫన్నీ డైలాగ్స్  అద‌రిపోయేలా ఉన్నాయి. మహతి స్వరసాగర్ సంగీతాన్ని, సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీని అందిస్తున్న  ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్ప‌టికే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టీజర్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తుండ‌టంతో  సినిమా పై అంచనాలు బాగానే పెరిగాయి. 

Leave a Reply

Your email address will not be published.