పధకం ప్రకారమే ఎమ్మెల్యే పై దాడివైసిపి శాస‌న‌స‌భ్యుడు పిన్నెల్లి వాహనంపై జ‌రిగిన దాడి వెనుక ఎన్నో అనుమానాలున్నాయ‌ని టిడిపి నేత వ‌ర్ల రామ‌య్య అన్నారు. వైసీపీ యువజన విభాగానికి జగన్‌ షరీఫ్‌ అనే పులివెందుల వ్యక్తి అమ‌రావ‌తి రైతుల ఆందోళన ల నుడుకు వ‌చ్చి, పిన్నిల్లి వాహనాన్ని అడ్డుకుంటున్న క్ర‌మంలో రాళ్ల‌ని రువ్వాడని, ఇది ఓ ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగింద‌ని ఇట్టే అర్ధ‌మ‌వుతోంద‌ని అన్నారు. 

ఓ వైపు రైతులు హైవే దిగ్బంధం చేస్తుంటే అటువైపుగా వ‌చ్చిన రాష్ట్ర మంత్రి, మరో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుంటార‌ని వేరే దారిలో పంపిన పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి వాహనాన్ని మాత్రం రైతుల మధ్యకు పంపించడం వెనుక చాలా త‌తంగం న‌డిచింద‌ని, ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తోనే త‌న‌ కారుపై దాడి చేయించుకుని, రైతులు, టిడిపిల‌పై నెపం నెట్టేసి ల‌బ్ది పొందాల‌ని, ఉద్య‌మాన్ని నీరు గార్చాల‌ని చేసిన‌ స్టేజి మేన్‌జ్‌డ్‌ డ్రామాగా వర్ల రామయ్య అభివర్ణించారు. దీనిపై జగనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published.