బ‌న్నీతో ఫైటింగ్ కు సిద్ధమైన అనసూయజబర్ధస్త్ అనే కామెడీ షో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాల‌లోనూ స‌త్తా చూపిస్తోంది. ‘క్షణం’, ‘యాత్ర’, ‘సోగ్గాడే చిన్ని నాయన ల‌తో మెప్పించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్త గా అవార్డులను అందుకుంది. వ‌రుస సినిమా ఛాన‌క‌స‌లు ప‌ట్టేస్తున్న‌ ఈ భామామ‌ణి తాజాగా అల్లు వార‌బ్బాయి అర్జున్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే తనలోని ఎన్నో యాంగిల్స్ చూపించిన ఈ అమ్మడు. ఈ చిత్రంలో బ‌న్నీతో ఫైటింగ్ చేసేందుకు ర‌డీ అవుతోంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్న టాక్‌. 

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్నఈ సినిమాలో అన‌సూయ‌ది కీల‌క భూమిక‌ట‌. పైగా చేసేది నెగెటివ్ రోల్ అని వినిపిస్తున్న టాక్‌. పోరాట సన్నివేశాల్లోనూ నటించనున్న అన‌సూయ ఇప్పుడు ప్ర‌ముఖ ఫైట‌ర్ల ద‌గ్గ‌ర ఇందుకోసం శిక్ష‌ణ పొందుతోంద‌ని తెలుస్తోంది. ఫైటింగుల్లో ఎక్కువ శాతం బన్నీతోనే ఉండ‌టంతో మ‌రింత శ్ర‌ద్ద‌వ‌హిస్తోంద‌ట‌. మ‌రెలా ఉండ‌బోతున్న యో ఈ ఫైట్ సీన్లు చూడాలి.


Leave a Reply

Your email address will not be published.