అల వైకుంఠ పురం లో గాసిప్స్ కు ఈ రోజుతో బ్రేక్ పడినట్లే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `అల వైకుంఠపురములో` స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయి గుమ్మడికాయ కొట్టేశారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కావడంతో మంచి హైప్ ఏర్పడింది. అయితే సంక్రాంతి బరిలో నిలుపుతున్నామని వీరే ఎప్పుడో చెప్పేసారు. అక్కడ నుంచే సంక్రాంతి ఫీవర్ టాలీవుడ్ లో మొదలయ్యిపోయింది.
ఇప్పటికీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో జస్ట్ కొన్ని రోజుల కిందటే కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. ఈ చిత్రం జనవరి 12నే విడుదల చేస్తామని వీరు చెప్తున్నా సరే షూటింగ్ ఇంకా జరుగుతుందని కానీ ఈ న్యూస్ ను ఎవరూ కవర్ చేయట్లేదని ఈ చిత్రం అనుకున్న సమయానికి రాదనీ రకరకాల వార్తలతో సోషల్ మీడియాలో బయటకు వచ్చారు. మొత్తానికి మాత్రం ఈరోజు షూటింగ్ పూర్తయ్యిపోయిందన్న అప్డేట్ తో ఈ వార్తలు అన్నిటికి ఒక చెక్ పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే బన్నీ తన డబ్బింగ్ కూడా పూర్తి చేసేసాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలబడడం ఖాయం అని చెప్పాలి.