‘మా’ పగ్గాలు చిరంజీకి ఇవ్వండి

తెలుగు సినీ నటులు సంఘం మా లో జరుగుతున్న పరస్పర మాటల తూటాల వ్యవహారంపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు. కేవలం మాలో తమ ఆధిపత్యం నిలుపుకోవటం కోసమే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఇలాంటి గొడవలు కారణంగా వర్గాలుగా విడిపోతోంది మా. ఈ పరిణామాలు సంఘ భవిష్యత్తుకు ఇబ్బందులుగా మారటమే కాదు. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. సినీ పెద్దల ముందు ఇలాంటి గొడవలు జరగడం కూడా మా మంచికే అనుకోవాలి ఇక అందరూ. ఇలాంటి సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా చూసుకుంటారు. బాధ్యతగా మాట్లాడతారు.
ఇక ముందు మా అసోసియేషన్ను మెగాస్టార్ చిరంజీవి ముందుండి నడిపించాలని కోరుకునే వ్యక్తులలో నేను మొదటి వాడిని అన్నారు తమ్మారెడ్డి. `మా` డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ ప్రవర్తించిన తీరుతో మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న లుకలుకలు బయటపడటంతో పాటు రాజీనామాల వరకు దారి తీసిన ఈ వ్యవహారంపై తమ్మారెడ్డి ఘాటుగానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తోంది.