పోలీసుల‌కు ర‌జ‌నీకాంత్ భార్య విజ్ఞ‌ప్తి

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కుమార్తె సౌందర్య రెండవ వివాహంకు సిద్ధం అయిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న సౌందర్య గత కొన్ని నెలలుగా తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన విశాఖన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరు గత కొన్నాళ్లుగా చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. సౌందర్య మాత్రమే కాకుండా విశాఖన్‌ కూడా రెండవ పెళ్లి వాడే అవ్వడంతో ఇద్దరి మధ్య‌ మంచి స్నేహం కుదిరింది. కొన్ని వారాల క్రితం వీరిద్దరి వివాహ నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ఇప్పుడు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి..

పెళ్లిని బయట ఎక్కడో కాకుండా రజినీకాంత్‌ ఇంట్లోనే చేయబోతున్నారు. తమిళనాడు, చెన్నైలోని పోయేస్‌ గార్డెన్‌లో సౌందర్య వివాహం జరుగబోతుంది. ఈ వివాహానికి తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు ఇంకా సినీ సెలబ్రెటీలు చాలా మంది హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున రాబోతున్న సెలబ్రెటీల భద్రత విషయంలో రజినీకాంత్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో పెళ్లి అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చి భద్రత కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది.

తాజాగా రజినీకాంత్‌ భార్య లత స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సౌందర్య వివాహం కోసం తమ ఇంటి వద్ద సెక్యూరిటీ ఇవ్వాలని కోరింది. దాంతో పాటు పెళ్లి జరిగే మూడు రోజుల పాటు పోయేస్‌ గార్డెన్‌ వైపు ట్రాఫిక్‌ను మల్లించాలని కూడా కోరింది. సూపర్‌ స్టార్‌ నుండి రిక్వెస్ట్‌ వస్తే ఎవరు మాత్రం నో చెప్తారు చెప్పండి. వెంటనే ఓకే చెప్పారు. దాదాపు 55 మంది పోలీసులు భద్రత ఇవ్వ‌బోతున్నారు. 50 మంది కానిస్టేబుల్స్‌ కాగా, న‌లుగురు ఎస్‌ఐలు, ఒక సీఐ ఈ భద్రతను పర్యవేక్షించబోతున్నారు. మూడు రోజుల పాటు సౌందర్య వివాహం వైభంగా జరుగబోతుంది. సంగీత్‌తో ప్రారంభం అయ్యి కార్యక్రమం జరుగనుంది. రజినీకాంత్‌ మరో అల్లుడు ధనుష్‌ ప్రస్తుతం పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.