‘సాహో’ రిలీజయ్యాక పెళ్లి!


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?  పదే పదే అభిమానులు సహా మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న ఇది. నేడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా అయినా ప్రభాస్ పెళ్లి గురించి ఏదైనా క్లూ దొరుకుతుందనే భావించారు. కానీ దీనిపై పెదనాన్న దాటవేశారు. అయితే మీడియా జనం మాత్రం సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి కబురు అందే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి రిలీజ్ తర్వాత పెళ్లాడుతానని ప్రభాస్ అన్నాడు. ఐదేళ్లకు బాహుబలిని పూర్తి చేసినా, ఆ వెంటనే సాహో మొదలు పెట్టేయడంతో పెళ్లి గురించి ఆలోచించలేదు. ఈ సినిమా పేరుతో మరో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి.  ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న ప్రభాస్ కంగారు పడుతున్నారు.. అన్నిటికీ సమాధానం ఆగస్టు తర్వాతనే ఉంటుందేమో!

Leave a Reply

Your email address will not be published.