కొత్త ఒర‌వ‌డి సృష్టించ‌నున్న ‘ఆహా’ యాప్‌తెలుగు మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టించాలనే లక్ష్యంతో  మైహోం గ్రూప్ నుంచి   ఆహా యాప్‌ను లాంచ్ అయ్యంది.  ప్రతి తెలుగు వాడి గుండెలకు హత్తుకునేలా భారీ ప్రణాళికతో ఆహా యాప్ ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చిన‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు.తెలుగు ఇండస్ట్రీలోని కీలక వ్యక్తుల భాగస్వామ్యంతో   రూపొందిన ఈ ఆహా యాప్.  ప్రివ్యూ కార్యక్రమం శ‌నివారం రాత్రి సినీ ప్ర‌ముఖుల న‌డుమ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, మైహోం గ్రూప్ డైరెక్టర్‌ జూపల్లి రామురావు, సినీ దర్శకుడు క్రిష్, హీరోలు విజయ్‌ దేవరకొండ, నవదీప్‌ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.   
మైహోమ్ గ్రూప్‌ డైరెక్టర్‌ రామురావు. మాట్లాడుతూ నిర్మాణ రంగంలో 35 ఏళ్లుగా మైహోమ్ గ్రూప్ విశేష సేవలందిస్తోందని అన్నారు.  టాప్‌ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్‌ ఆహాను సిద్ధం చేయడంలో, కంటెంట్‌ను రూపొందించడంలో క్రియాశీలకంగా  వ్య‌వ‌హ‌రించాల‌ని  ఆహా ద్వారా మొబైల్‌ ఫోన్‌లో ఎక్కడైనా ఎప్పుడైనా చూడొచ్చని,  ఇలాంటి యాప్‌  తెలుగు మార్కెట్‌లో అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.  అని  ఆహా టీమ్.  చెప్పుకొచ్చింది. ది ఓన్లీ ప్రివ్యూ మాత్రమేనని, ఉగాది రోజు ఆహా యాప్‌ లాంచ్‌ చాలా గ్రాండ్‌గా ఉంటుందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.