షాకింగ్ః క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు టైటిల్ మార్చేసిన వ‌ర్మ‌

వ‌ర్మ తాను ఏ ప‌ని చేసినా త‌న‌కు న‌చ్చిన‌ట్లు చేస్తాడు. అంతా నా ఇష్టం. నేను చెప్పేదే వేదం. నేను తీసిందే సినిమా అన్న వ‌ర్మ‌కి ఒక్క‌సారిగా ఎదురు దెబ్బ‌త‌గిలింది. `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` ఈ చిత్ర టైటిల్ ను మార్చుతూ వ‌ర్మ నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ర్మ వెనక్కు త‌గ్గాల్సొచ్చింది. ఇదే టైటిల్‌తో సెన్సార్‌కు వెళితే అక్క‌డ తిర‌స్క‌ర‌ణ అనేది త‌ప్ప‌ద‌ని ఆయ‌న `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు`గా మార్చారు. ఇక‌పోతే మునుపు ఆయ‌న పెట్టిన టైటిల్‌కి ప్ర‌స్తుతం ఉన్న టైటిల్‌కి చాలా తేడా ఉంది. పాత టైటిల్ చాలా వివాదాస్ప‌దంగా ఉండ‌డంతో ఈ చిత్రానికి అంత బ‌జ్ క్రియేట్ అయ్యింది. కానీ ఇప్పుడున్న కొత్త టైటిల్ చాలా పేల‌వంగా ఉంద‌ని సినీ వ‌ర్గాలు కొంత మంది భావిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ ఈ సినిమాను రూపొందించడంతో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలపై గుర్రుగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక విడుదలకు మధ్యలో ఒకే రోజు సమయం ఉండటం.. సెన్సార్ కార్యక్రమాలు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వర్మ గత సినిమాల మాదిరే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? లేక సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ప్ర‌స్తుతం ఈ టాపిక్‌.
అయితే ఇటీవ‌ల వ‌ర్మ తీసే చిత్రాల‌న్నీదాదాపుగా ఇలా వివాదాస్పందంగానే ఉండ‌డంతో ప్ర‌తిదీ కోర్టుకేసులు, అలాగే సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌డాలు వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతున్న విష‌యాలే. కానీ ఎప్పుడు వెన‌క్కు త‌గ్గ‌ని వ‌ర్మ ఈ టైటిల్ విష‌యంలో మాత్రం వెన‌క్కు త‌గ్గాల్సి వచ్చింది. అంటే సెన్సార్ వాళ్ళు ఎక్క‌డ ఒప్పుకోరో అని ముందుగానే ఆయ‌న టైటిల్ మార్చారు అంతే వ‌ర్మ‌కి కూడా తిప్ప‌లు త‌ప్ప‌లేద‌నే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.