పెట్రోల్, డీజిల్ ధరలు నేల చూపులు

ఫిబ్రవరి 2016 స్థాయికి క్రూడాయిల్ ధరలు పడిపోవటంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేల చూపులు చూడటం ఆరంభించాయి. ఓవైపు, కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే తాజాగా సౌదీ అరేబియా – రష్యా మధ్య ధరల యుద్ధం ఆరంభమయిన ప్రభావంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం ఆరంభించాయి. పెట్రోల్ ధరలు దాదాపు 8 నెలల తర్వాత మొదటిసారి రూ.71 దిగువకు పడిపోయినట్టు స్టాక్ వర్గాలు చెపుతుండగా, మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 30 పైసలు, 25 పైసలు తగ్గినట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29, డీజిల్ రూ.63.01
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.75.99, డీజిల్ రూ.65.97
చెన్నైలో లీటర్ పెట్రోల్ 73.02, డీజిల్ రూ.66.48
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.72.70, డీజిల్ రూ.65.16
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.74.72, డీజిల్ రూ.68.60 గా ఉంది.