‘ఉట్రాన్’ చిత్రంలో హీరో రోషన్ సరసన హరిరోషిణి

చిన్న‌త‌నంలో అనేక టివిషోల‌లో మిమిక్రీ చేస్తూ అల‌రించిన చిన్నారి  హరిరోషిణి గుర్తుందా? అయితే  రాజశేఖరెడ్డి, చంద్రబాబు గొంతులను అనుకరించడం ద్వారా బుల్లితెరపై సోదరితో కలిసి హ‌ల్‌చ‌ల్ చేసిన బాలిక‌ని చూసారుగా… చూసేఉంటారు…లీల‌గా అయినా గుర్తొస్తోందా? ఇప్ప‌డు  ఆ హరిరోషిణి  వెండితెరపై వర్ధమాన నటిగా దర్శనమివ్వబోతోంది. లీడ్ రోల్‌లో నటిస్తోంది.
  అయితే ఈ మ‌ధ్య  సినిమా షూటింగ్ లో జ‌రిగిన ఓ ఘటనతో హీరోపై అలిగి చెప్పాపెట్ట‌కుండా చెక్కేసింది. తీరా ఫోన్ కూడా స్విచ్చాఫ్ కావ‌టంతో  ఆరాలు తీస్తే అమ్మ‌డు అమ్మ‌మ్మ‌గారి ఊరెళ్లిపోయింద‌ని తేల‌డంతో దర్శకుడు తలపట్టుకున్నాడు.
ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…  ఉట్రాన్ చిత్ర కథను వినిపించ‌న‌ప్పుడే ద‌ర్శ‌కుడు సినిమాలో లిప్‌లాక్  ఉంటుందని దానికి అంగీక‌రిస్తేనే హీరోయిన్‌గా తీసుకుంటాన‌ని చెప్ప‌డంతో, ఎంట్రీ ముఖ్య‌మ‌ని సై అంది. తీరా  దర్శకుడు చెప్పినట్టే  లిప్‌లాక్‌ సన్నివేశంలో న‌టిస్తున్న‌ప్పుడు అర్ధంత‌రంగా హీరోని ప‌క్క‌కు తోసేసి….   లిప్‌లాక్ అని చెప్పి రోష‌న్‌స్మూచ్ చేస్తున్నాడంటూ ఆవేశంతో ఊగిపోయి, చెడా మ‌డా క‌డిగేసింది. ఈ సారి సరిగ్గా చేస్తానని హామీ ఇవ్వడంతో దర్శకుడు  రీటేక్  చేయ‌గానే క్యారవాన్ ఎక్కి బూతులంకించుకుంద‌ట‌.  దీంతో బిత్తరపోయిన ద‌ర్శ‌కుడు రెండూ ముద్దేకదా అంటూ త‌న అమాయ‌క‌త్వం బైటపెట్టుకోవ‌టంతో ఆత‌నిపైనా భ‌గ్గుమంది  రోషిణి.  లిప్‌లాక్ అంటే పెదాలతో పెదాలను తాకించడం, స్మూచ్ అంటే పెదాలతో పెదాలను కలిపి నాలుకను చప్పరించడం అని వివరించడంతో… ఈ రెంటికీ న‌డుమ‌ ఇంత తేడా తెలియని దర్శకుడు ఒక్కసారిగా షాక్ కు గురికావాల్సి వ‌చ్చింది.  
యూనిట్ వర్గాలు ఎంత సర్ది చెప్పినా వినకుండా ఊరెళ్లిపోవ‌టంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవల‌సి వ‌స్తోంద‌ని నిర్మాత ల‌బోదిబో మంటున్నాడు.   హీరోయిన్‌కు సర్ది చెప్పే ప‌నిలో నిర్మాత, ద‌ర్శ‌కుడు ఆమె చుట్టూ తిరుగుతుండ‌టంతో అంతా ఔరా అనుకునే ప‌రిస్థితి.   కెరీర్ ఆరంభంలోనే ఇలా షాకింగ్ సంఘటన ఎదురవ్వడం   ఆమె కూ ఇబ్బందేన‌ని, సినీ జ‌నాలు నొస‌ళ్లుచిట్లిస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published.