బొత్సపై సినీ అశ్వినీదత్ విమర్శలు….


ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సినీ నిర్మాత అశ్వినీదత్ విమర్శలు గుప్పించారు. అమరావతిపై జగన్‌ సర్కారు  ప్రజల్లో ఆందోళన సృష్టించడం తగదన్నారు. దీనికి తోడు వైసీపీ నాయకులు రాజధానిపై స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని బొత్స చెబుతున్నారని… ఆయన భాషే మనకు సరిగా అర్థం కాదని ఎద్దేవా చేశారు. బొత్స చెప్పేది ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాదన్నారు. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారని… రాజధాని అంశం ఆయనకు ఏదో బొమ్మలాటలా ఉన్నట్టుందని దుయ్యబట్టారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెడీ అంటే రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా తీసేందుకు ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అశ్వినీదత్ అన్నారు. కానీ అవన్నీ వదులుకుని ఆయన ప్రజాజీవితంలోకి వచ్చేశారని చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఆరేళ్ల నుంచి నిలబడ్డారని కొనియాడారు. సంక్రాతికి సినిమాలు విడుదల చేయడం కాదు.. ప్రజలు ఆందోళన చేస్తుంటే సంఘీభావం ప్రకటించాలి కాని.. చిత్ర పరిశ్రమలోని కథనాయకులు సూపర్‌ స్టార్లగా ఫీలవుతుంటారని  ప్రజలు ఆందోళనలో ఉంటే కనీసం స్పందించారని ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా వారంతా అమరావతికి కట్టుబడి ఉండేలా ప్రకటన చేయాలన్నారు. 

Leave a Reply

Your email address will not be published.