కోర్టు కు హాజర్ ఐన జగన్ & కో
సీబీఐ, ఈడీ కోర్టు విచారణలకు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎట్టకేలకు ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. విజయవాడలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ నేరుగా నాంపల్లిలో కోర్టుకు హాజరయ్యారు.
గ త 8 ఏళ్లుగా అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది మార్చి 22న చివరిసారిగా కోర్టుకు జగన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎక్కువగా ఉందంటూ జగన్.. ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయింపు పొందినా తదుపరి సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ల పై విచారణ జరిపిన కోర్టు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి వ్వాలంటూ జగన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ… కచ్చితంగా హాజరుకావాలని ఈనెల 3న సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు సహా ఈడీ నమోదు చేసిన 6 అభియోగపత్రాలకు సంబంధించిన విచారణకు ఇవాళ జగన్, విజయసాయిరెడ్డి లతో పాటు నిందితులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏస్ శామ్యూల్ తదితరులు విచారణకు హాజరయ్యారు.