సిక్స్ కొట్టేలా చూస్తానంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’.  విజ‌య్ స‌ర‌స‌న‌ రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా  ప్రి రిలీజ్ ఈవెంట్ నార్సింగిలో   ఆదివారం రాత్రి  అట్టహాసంగా జరిగింది.

ఈ  కార్య‌క్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ: “  చిరంజీవితో నాన్-స్టాప్ సూప‌ర్ హిట్లు ఇచ్చిన కెఎస్   రామారావు గారి క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ నుంచి  ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా హిట్ కావాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు.   .

సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్ మాట్లాడుతూ: “ విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చిన నేనూ, కేఎస్ రామారావు  మంచి మిత్రులం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడి హిట్లు తీయాల‌ని చూసే వాడిని.  ఆయ‌న సినిమాలు హిట్ కావాల‌నుకునే వాళ్ల‌లో ప్ర‌ధ‌ముడ‌ని, ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది అని అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ: “విజయ్ తో ఇప్ప‌టికే   రెండు సినిమాలు చేసా… రాత్రే నాకు మూడో సినిమా చెయ్యవా? అనడిగానో లేదో… ఎప్పుడైనా ర‌డీ అని హామీ ఇచ్చాడు.   స్వచ్ఛమైన టాలెంట్, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న అరుదైన న‌టుడు విజయ్. ఎన్ని విజ‌యాలు వ‌చ్చినా  నిగర్విలా సాగుతున్నాడు.  భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు అందుకుంటాడు.  నేను అత్యంత‌ ఈర్ష్యపడేంత నిర్మాత ఎవ‌రైనా ఉన్నారంటే అది కేఎస్ రామారావు.ఆత‌ని సినిమాలు చూస్తే  ప్యాషన్ కనిపిస్తోంది   ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే సందేహం  రౌడీ బాయ్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయిస్తారని అనుకుంటున్నా” అని చెప్పారు.

హీరోయిన్ ఇజాబెల్లా మాట్లాడుతూ: “ఈ సినిమాలో విజయ్ సరసన నటించే అవ‌కాశం రావ‌ట‌మే నాకు వ‌చ్చిన‌ గౌరవంగా భావిస్తున్నా. ఈ అవ‌కాశం ఇచ్చిన క్రాంతిమాధవ్ , రామారావు, వైభ‌వ్‌ల‌కు థాంక్స్ అని చెప్పింది.

మ‌రో హీరోయిన్‌ క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ: “  తెలుగులో చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. విజయ్ తో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియెన్స్. ఆయన క్యారెక్టర్లో లీన‌మై న‌టించ‌డం   నాకు చాలా నచ్చింది అని చెప్పారు.

చిత్ర క‌థానాయిక‌ల‌లో ఒక‌రైన  రాశీ ఖన్నా మాట్లాడుతూ: “ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైన రోజు నుంచి  నన్ను చాలామంది యామినీ అని పిలుస్తున్నారంటే అది ఎంత హత్తుకు పోయిందో అర్ధ‌మ‌వుతోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది.  ప్రేమ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్.  ఈ ఎమోషన్ గురించి చాలా మంది చాలా సార్లు వర్ణించారు అది కూడా తక్కువే అనిపిస్తుంది.   ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది ప్రేమలో ఉన్నవాళ్ల కోసమే కాదు, ప్రేమలో లేనివాళ్ల కోసమూ కూడా. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ప్రేమను ప్రేమిస్తాను. ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని విజయ్ చెప్పినప్పుడు నేను కూడా హర్ట్ అయ్యాను.    అతనితో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నా  అని చెప్పారు.

ఇంకో క‌థానాయిక ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ: “  తెలుగులో నేను సంతకం చేసిన మొదటి సినిమా. ఈ సినిమాలో విజ‌య్‌తో క‌ల‌సి ప‌నిచేయ‌టం గ్రేట్ ఇన్స్పిరేషన్.   ఈ సినిమాలో సువర్ణ అనే ఫెంటాస్టిక్ రోల్  చేసా, ఇది   డీగ్లామర్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు మాట్లాడుతూ: “ ఎవరైనా వేలంటైన్స్ డేకి ఒక అమ్మాయిని తీసుకెళ్ల‌డానికే ఇబ్బంది ప‌డ‌తారు కానీ  విజయ్ నలుగురు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాడంటే అంద‌రిని  హ్యాండిల్ చెయ్యగలుగుతాడనుకుంటున్నా, కేఎస్ రామారావు గారికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ: “ ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా విజయ్ దేవరకొండ ఎనిమిది సినిమాలు చేసాడు. ఎనిమిది సినిమాలు ఒకదానికొకటి పోలిక ఉండదు. ఇప్పుడు నేను చేసింది తొమ్మిదోది. ఇదీ అంత డిఫ‌రెంట్‌గా ఉంటుంది.     ఓ కొత్తదనాన్ని ఎంచుకుంటూ  సాగుతున్న విజ‌య్  ధియేట‌ర్‌కి వచ్చిన వాళ్లకు వినోదం కావాలని కోరుకుంటాడు. ఒక్క అమ్మాయితో న‌టించ‌డానికే   కష్టపడతున్న ఈ రోజుల‌లో నలుగురు అమ్మాయిలతో  విజయ్ చాలా కష్టపడి అంద‌రినీ మెప్పించేలా చేసాడు.  అని అన్న‌రు.

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు మాట్లాడుతూ: “ఈ సినిమా నేను మొదలుపెట్టానికి ప్రేరణ ఇచ్చింది క్రాంతిమాధవ్ చెప్పిన కథ. విజయ్ కూడా కథ విన్నాక ఇది చాలా గొప్ప సినిమా అవుతుందని చెయ్యడానికి ముందుకు వచ్చాడు.  మా అందరి కంటే ఈ సినిమాలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి, చివ‌ర‌కి ఎడిటింగ్ రూములో ఉండి 100 శాతం పర్ఫెక్టుగా వచ్చిందా, లేదా అని చూసుకున్న వ్యక్తి విజయ్.   ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఎంత పోటాపోటీగా నటించారో చూసి అంతా ఆశ్చర్యపోతారు. నేను న‌వ‌ల‌లు సినిమాలుగా తీసా… కానీ… క్రాంతిమాధవ్ ఈ సినిమాని నాకో మంచి నవల లాగా తయారుచేసి ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు చెపుతున్నా అని అన్నారు.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ: “నాలుగేళ్ల క్రితం 2016లో ‘పెళ్ళిచూపులు’ తో ప‌రిచ‌యం అయిన నేను  నాలుగేళ్లలో హిట్లు కొట్టాను. విజయ్ అంటే ఎవ్వడికీ తెలియ‌ని న‌న్ను హీరోగా నిలిపింది అభిమానులే   ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతు న్న నాకు  సింగిల్, డబుల్ తీసే ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు ప‌డేలా సిక్స్‌ కొట్టాలని బ్యాట్ ఊపుతా. నేను చేసిన‌ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ , ‘నోటా’ చేసిన. ‘డియర్ కామ్రేడ్’ ఇలా కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి.  ఇప్పుడు కూడా సిక్స్ కొట్టాలనే దిగుతున్నా, ఇకనుంచీ సిక్సులు కొట్టడానికే చూస్తా అని అన్నారు . ఫిబ్రవరి 14న ఈ సినిమాకొచ్చి మీరందరూ ప్రేమలో పడతారనుకుంటున్నా.   కేఎస్ రామారావు గారికి మ‌రో సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 


Leave a Reply

Your email address will not be published.